తుగ్గలి
రాష్ట్రంలో గల ప్రజల క్షేమమే ప్రభుత్వ లక్ష్యంమని మాజీ సర్పంచ్ శభాష్ పురం హనుమంతు తెలియజేసారు.గురువారం రోజున మండల పరిదిలోని శభాష్ పురం గ్రామం గ్రామ సచివాలయం నందు అధికారులు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు.గ్రామ సర్పంచ్ పుష్పవతి, మరియు ఎంపీటీసీ రామాంజనమ్మ మరియు శభాష్ పురం గౌరవ సలహాదారుడు మాజీ సర్పంచ్ హనుమంతు అధ్యక్షతన అధికారులు గ్రామ సభను నిర్వహించారు.ఈ సందర్భంగా అదికారులు మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా రెవిన్యూ శాఖ తరుపున ఇస్తున్నటువంటి రేషన్ కార్డ్స్,ఇంటి పట్టాలు, జగనన్న శాశ్వతగా భూ హక్కు-భూ రక్ష పథకం, పట్టాదారు పాస్ బుక్స్ మొదలైన సంక్షేమ పథకాలను విఆరోఓ రామాంజినేయులు ప్రజలకు వివరించారు.అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు తెలియజేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క పథకం గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని మాజీ సర్పంచ్ హనుమంతు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుష్పవతి కు, ఎంపిటిసి రామాంజినమ్మ మరియు గ్రామ గౌరవ సలహాదారుడు శభాష్ పురం హనుమంతు కు అధికారులు శాలువాను కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రెటరీ రాముడు,వీఆర్వో రామాంజనేయులు,సీసీ శేఖర్,సచివాలయం సిబ్బంది,విఆర్ఏ శేఖర్,సందీప్,గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.