హైదరాబాద్
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని శ్రీ కృష్ణ జ్యూవెల్లరి కి చెందిన శ్రీ కృష్ణ హౌస్ తో పాటు నగరంలోని పలు కార్యాలయాల్లో ఈడీ అధికారుల సోదాలు జరిగాయి. అక్రమం గా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసారని 2019 లో పలువురిని డీఆర్ఐఅరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. గతంలో నమోదైన కేసు పైనా…లేదా మరో కేసు పై సోదాలు నిర్వహిస్తున్నారా అని తేలాల్సి ఉంది. సోదాల్లో భాగంగా పలు ఫైళ్లను అధికారులు తీసుకు వచ్చారు. మని లాండరింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణపై సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.