హైదరాబాద్
హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫతేనగర్ ప్రాంతంలో నాల లో ని గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. శవాన్ని చూసిన స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పటల్ కు తరలించారు. మృతదేహం గుర్తింపు కష్టంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.