ఎమ్మిగనూరు
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో, వారు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైయిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు. రైతులను వెంటనే ఆదుకోవాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ శరాఫ్ బజార్, పెద్దమసీదు, గాంధీ సర్కిల్ నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి, RDS ప్రాజెక్టును వెంటనే – పూర్తి చేయాలి,రైతు కోసం – తెలుగుదేశం అని నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు, తెలుగు మహిళలు, తెలుగు యువత కార్యకర్తలు పాల్గోన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా వైసిపి ప్రభుత్వం విఫలమైంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర...