Home ఆంధ్రప్రదేశ్ విపక్షనేతను వైసీపీ అవమానిస్తోంది శాసనసభలో మండిపడ్డారు టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు

విపక్షనేతను వైసీపీ అవమానిస్తోంది శాసనసభలో మండిపడ్డారు టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు

327
0

అమరావతి మార్చ్ 7
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ విపక్ష, అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధం హోరెత్తే అవకాశం కనిపిస్తోంది. మూడు సంవత్సరాలుగా టీడీపీ సభ్యులను అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు శాసనసభలో టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు. ప్రతిపక్ష నాయకుడుతో పాటు కుటుంబ సభ్యులను సైతం అవమానిస్తున్నారు. శాసనసభా గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంట గలుపుతున్నారు.కర్తవ్య బాధ్యతను నెరవేర్చడం కోసం టీడీపీ తరపున సభకు హాజరు అవుతున్నాం. శాసనసభలో ఇన్ని ఇబ్బందులు, అవమానాలు ఎప్పుడు ఎదుర్కోలేదన్నారు అచ్చెన్నాయుడు. 30 అంశాలను సిద్ధం చేసి సభకు వెళ్తున్నాం. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదు. శాసనసభను కౌరవ సభగా మార్చారు. మూడేళ్ళలో సభ సజావుగా నడవడం లేదు. సభ గౌరవం పెంచేలా ప్రతిపక్ష పార్టీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించాలి.స్పీకర్ వైసీపీ సభ్యుడిగా కాకుండా హుందాగా వ్యవహరించాలి. సభలో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లం. ప్రభుత్వ ప్రకటనలకు శాసనసభా నిర్వహణపై ఆచరణలో పొంతన ఉండటం లేదన్నారు అచ్చెన్నాయుడు. తొలుత సభకు వెళ్లకూడదని భావించిన టీడీపీ ప్రజా సమస్యల ప్రస్తావనకోసం సభకు వెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, సభకు మాత్రం విపక్ష నేత చంద్రబాబునాయుడు హాజరుకావడంలేదు.

Previous articleవేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
Next articleటీడీపీ వారికి ఆవేశం ఎక్కువ.. మంత్రి బొత్స సత్యనారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here