Home జాతీయ వార్తలు దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్‌ కేసులు

272
0

న్యూఢిల్లీ అక్టోబర్ 18
దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం గత 230 రోజుల్లో (సుమారు 8 నెలలు) ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3,40,81,315కు చేరాయని తెలిపింది. ఇందులో 1,89,694 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,34,39,331 మంది కోలుకున్నారని వెల్లడించింది. మరో 4,52,290 మంది కరోనా వల్ల మరణించారని పేర్కొన్నది.గత 24 గంటల్లో కొత్తగా 19,582 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడగా, మరో 166 మంది మరణించారని తెలిపింది. దీంతో రికవరీ రేటు 98.12 శాతం, మరణాల రేటు 1.33 శాతం అని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 97.79 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Previous articleవాతావరణ సంక్షోభంపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రపంచ దేశాలకు యునిసెఫ్ పిలుపు
Next articleన‌ది ఉధృతివ‌ల్ల కొట్టాయం జిల్లాలో కొట్టుకుపోయిన ఇల్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here