వరంగల్ నవంబర్ 18
తమ విధినిర్వహణలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలంటే సిబ్బంది మధ్య పోటీ తత్వం వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్వర్యంలో మూడవ త్రైమాసిక రివార్డు
మేళాను పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానం ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వివిధ కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో, చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి నగదు రివార్డులతో పాటు, పోలీస్ స్టేషన్లలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకుగాను రూపొందించబడిన 17 వర్టికల్స్ విధానంలో భాగంగా సిబ్బందికి అప్పగించిన వర్టికల్స్ లో అయా వర్టికల్స్ లో రాణించిన మొదటి ఇద్దరు పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వర్టికల్స్ విధానం ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది తమకు అప్పగించిన పనుల్లో రాణిస్తున్నారని, ఇదే రీతిలో తమ అప్పగించిన పనులను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడంతో పాటు వారికి మనపై నమ్మకం పెరుగుతుందని. నేరాలను నియంత్రించడంలో కోసం ప్రతి ఒక్కరం సమన్వయంతో పనిచేయాల్సి వుంటుందని, నేరాలను నియంత్రించాలంటే ముందుస్తు సమాచారం సేకరించడమే కీలకమని, అదే విధంగా ప్రస్తుతం తెలంగాణ పోలీస్ విభాగానికి అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించడంలో వరంగల్ కమీషనరేట్ పోలీసులు సిద్ధహస్తులుగా మారడం ద్వారా నేరాలను నియంత్రించడంతో పాటు, నేరాలను పరీక్షించడం మరియు నేరస్తులను గుర్తించడం చాలా సులభమవతుందని, విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది శాఖపరమైన గుర్తింపు వుంటుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈ కార్యక్రమములో డిసిపిలు శ్రీనివాస్ రెడ్డి, పుష్పారెడ్డి, ఎ.ఎస్పీ వైభవ్ గైక్వాడ్, అదనపు డిసిపిలు భీంరావు, సంజీవ్, ఎసిపి ప్రతాప్ కుమార్, సిసిఆర్ బి ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, నరేందర్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.