Home ఆంధ్రప్రదేశ్ తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత

తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత

278
0

తిరుమల
తిరుమల రెండవ ఘాట్ రోడ్డును  తాత్కాలికంగా మూసివేసారు. లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఘటనలో ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డులో  భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.భక్తులు .ఇబ్బంది పడుతున్నారు. ఎగువ ఘాట్ రోడ్ లో నాలుగు చోట్ల రహదాదరి దెబ్బ తిన్నది. చెట్లు కూలాయి. కొండ చరియులు విరిగి పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్డు కుంగిపోయింది. అలిపిరి వద్ద వాహానాలను ఆపేవేసారు. రహాదారి మద్యలో  చిక్కుకు పోయిన వాహానాలను వెనుకకు తెప్పించారు. కొండచరియలు తొలగించే పనిలో టీటీడీ విజిలెన్స్,ఇంజనీరింగ్,అటవిశాఖధికారులు నిమగ్నమయ్యారు.
ఇటీవల తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.

రెండు ఘాట్‌ రోడ్లలో చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

ఆ సమయంలో కూడా తిరుమలకు రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుపతిని వర్షాలు చుట్టుముట్టాయి.

ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పోయాయి.

ఈ వర్షాల కారణంగా తిరుమల లో రూ. 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Previous articleరాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ పర్యట ప్రాంతాలను పరిశీలించిన యస్.పి
Next articleమహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయంలో 212 మందికి కరోనా పాజిటివ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here