వచ్చే సాధారణ ఎన్నికల్లో తేదేపా దే ఆధికారం
ఎమ్మిగనూరు
పార్టీ టిక్కెట్ల కేటాయింపు హైకమాండ్ దే ననీ, అధిష్టానం ఆదేశిస్తే తమ కుటుంబ పోటీకి సిద్ధం అని మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణంలో పార్లమెంటు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఎమ్మిగనూరు లో తను పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం కొత్తగా ఏమి కాదని, గతంలో కూడా కార్యాలయం ఉండేదన్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ని ఆహ్వానించామని ఆయన సరియైన విధంగా స్పందించ లేదన్నారు. ప్రస్తుతం ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని, వేల కోట్ల రూపాయలు సంక్షేమం పేరు తో వాడు కుంటున్నారని విమర్శించారు. ఇక మిగిలింది సహకార బ్యాంకు లే నన్నారు. పోలీసుల అండతో రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాబోవు సాధారణ ఎన్నికల కు తమ ని బలోపేతం చేసుకోవడానికే తన ప్రయత్నం అని అన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం నాగిరెడ్డి, సుధాకర్ శెట్టి, మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి,హెచ్ పి రఘు, కదిరికోట ఆదెన్న, అల్తాఫ్, యూనుస్,తిమ్మాపురం మల్లికార్జున రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.