Home ఆంధ్రప్రదేశ్ దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి కెవిపిఎస్ డిమాండ్

దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి కెవిపిఎస్ డిమాండ్

209
0

మంత్రాలయం
హొలగుంద  మండలం పెద్ద గోనేహల్లు  గ్రామంలో దళితుల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ నందు దాడులకు వ్యతిరేకంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది .ధర్నాను ఉద్దేశించి కెవిపిఎస్ నాయకులు  అనిల్.MRPS నాయకులు యోబు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జయరాజ్ మాట్లాడుతూ పెద్ద గోనేహళ్ గ్రామంలో శాంతియుతంగా దళితులు అంత కలిసి   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు  చేసుకోను ఉండగా . అక్కడ ఉండే బిసి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని వాళ్లు కుట్రపూరితంగా  అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి వాల్మీకి విగ్రహం పెట్టాలని వాళ్ళు . ఒక కుట్ర పూరితమైన నిర్ణయం ద్వారా దళితవాడలో గొడవలకు పాల్గొనడం జరిగింది ఇది సరైనది కాదు మేమే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని దళితులు అనడం జరిగింది అంతలోనే   బీసీ సామాజికవర్గానికి చెందిన వాళ్లు మూకుమ్మడిగా వాళ్లు దాడి చేయడం జరిగింది ఆడవాళ్ళూ అని కూడా లెక్క చెయకుండగా కర్రలతో కట్టెలతో రాడ్లతో దాడి చేయడం జరిగింది గాయపడినవారిని హాస్పిటల్ ఆదోని కి తీసుకు వెళ్లడం జరిగింది . దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని  గాయపడిన వారి కుటుంబాలను వెంటనే  ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యం. దావీదు .ఎస్ వీరేష్. రాజు. అబ్రహము .మోజెస్ తదితరులు పాల్గొన్నారు.

Previous articleఅనాథలకు అండగా ఉందాము –వివేకానంద సంస్థలో ఘనంగా దసరా వేడుకులు –పేదలకు అన్నదానం, వస్త్రదానం
Next articleపేద వారి పెండ్లికి కావలసిన వస్తువులు ఉచితంగా పంపిణీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here