బెంగళూరు సెప్టెంబర్ 23
కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. చుట్టుపక్కన భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. గాయపడ్డ వారిని స్థానిక విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సిటీలోని చామరాజపేటలో ఓ భవనంలో ఈ ప్రమాదం జరగినట్లు సమాచారం. పేలుడుకు కారణాలేంటో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాణాసంచ పేలుడు ఒక కారణమని సమాచారం.