ములుగు
మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది. మీద దెబ్బ తగులుతోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పేరూరు చత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో సోమవారం తెల్లవారు జామున పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈఘటన లో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఏకే-47, ఇతర రైఫిల్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఉన్నట్లు సమాచారం. అధికారులు మాత్రం ధృవీకరంచలేదు. ఈ ఎన్కౌంటర్ బీజాపూర్ జిల్లా తర్లగూడ ఈటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులకు గాయాలు తగిలిన విషయంలో కుడా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు కదలికలు ఎక్కువ కావడంతో పోలీసు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అప్పటి నుంచి వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.