శ్రీనగర్ అక్టోబర్ 12
జమ్మూ కశ్మీర్‌లో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరిని ముఖ్తర్ షాగా గుర్తించారు. ఇతడు గతంలో బిహార్‌కు చెందిన వీరేంద్ర పాశ్వాన్‌ను హత్య చేసిన అనంతరం సోఫియాన్‌కు పారిపోయాడు. దీని గురించి కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్ చేశారు. సోఫియాన్ జిల్లాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక దాడిలో ఈ ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. వీరు లష్కరే తోయిబాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. తొలుత వీరిని లొంగిపోమని సూచించామని… కానీ వారు వినకుండా తమపై కాల్పులు ప్రారంభించారని పోలీసులు తెలిపారు. దాంతో తాము కాల్పులు చేయాల్సి వచ్చిందని.. ఈ క్రమంలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా నేరపూరిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని.. సోదాలు కొనసాగుతున్నాయిన తెలిపారు.