విశాఖపట్నం
అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, కేరళ అల్తుర్ పార్లమెంట్ సభ్యులు రమ్య హరిదాస్ గురువారం నాడు అరకు వ్యాలీ మండలంలోని పెదలబుడు గ్రామంలోని ” గిరి గ్రామ దర్శన్ ” సందర్శించారు. ఈ సందర్భంగా గొడ్డేటి మాధవి మీడియాతో మాట్లాడుతూ కనుమరుగవుతున్న గిరిజన సాంప్రదాయాలను నేటి తరానికి కళ్లకు కట్టే విధంగా చూపించడమే ఈ ” గిరి గ్రామ దర్శన్ ” యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. కనుమరుగవుతున్న గిరిజన సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా అచ్చమైన గిరిజన సంప్రదాయాలను తిలకించాలి అనే పర్యాటకులకు అరకు మండలం పెదలబుడు గ్రామంలోని ” గిరి గ్రామ దర్శన్ ” సందర్శించవలసిందిగా కోరారు. సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి గిరిజన సాంప్రదాయ వేషధారణ ధరించిన అరకు ఎంపీ, అక్కడ ఏర్పాటుచేసిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.