పనాజి సెప్టెంబర్ 21
గోవాలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ పనాజీలో మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ గోవా యువతకు ఆయన ప్రామిస్ చేశారు. ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే, ప్రతి ఒక నిరుద్యోగికి మూడు వేల నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. 80 శాతం ఉద్యోగాలు గోవా యువతకే రిజర్వ్ చేస్తామన్నారు. ప్రైవేటు సంస్థల్లోనూ వాళ్లకే 80 శాతం ఉద్యోగాలు దక్కేలా చేస్తామన్నారు. టూరిజంపై ఆధారపడ్డ కుటుంబాలు కోవిడ్ వల్ల దెబ్బతిన్నాయని, అయితే వారికి నెలకు 5వేలు ఇస్తామన్నారు. గనులను మూసివేయడం వల్ల కూడా మైనింగ్ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, వారికి కూడా పనులు మొదలయ్యే వరకు నెలకు 5వేలు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.