హైదరాబాద్, నవంబర్ 09
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ అధ్వర్యంలో రోడ్ల అభివృద్ధికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ది కార్యక్రమం ద్వారా నగరంలో రవాణా ఇబ్బందులను అధిగమించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల ట్రాఫిక్ ను అధిగమించి గమ్యానికి చేరడానికి విపరీతమైన జాప్యం అలసట లేకుండా త్వరితగతిన చేరేందుకు వెసులుబాటు కలుగుతుంది.ఈ నేపథ్యంలో నగరంలో అవసరం కావాల్సిన ఫ్లై ఓవర్లు, అండర్ పాసు ల నిర్మాణాలను పలు చోట్ల కోట్లాది రూపాయలతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలో మిధాని జంక్షన్ నుండి ఓవైసి ఆసుపత్రి జంక్షన్ వరకు ఓవైసీ ఆసుపత్రి జంక్షన్ వద్ద రూ. 63 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1.40 కిలోమీటర్ల దూరం గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 12 మీటర్ల వెడల్పు, యూని డైరెక్షన్ లో మూడు లైన్ల ఫ్లై ఓవర్ డిసెంబర్ మాసం చివరి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అందుకు 38 పిల్లర్ లనిర్మాణ పనులు పూర్తయ్యాయి. 33 గిల్డర్స్ గల 132 స్పన్స్ ఫిట్ చేయడం జరిగింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి క్రింది భాగంలో బి.టి రోడ్డు పనులు పురోగతిలో ఉంది . A1 ర్యాంపు సి.అర్.సి.పి పనులు పూర్తి కాగా A2 ర్యాంపు పనులు పురోగతిలో ఉన్నాయి.
అసంపూర్తిగా ఉన్న పనులు వివిధ అభివృద్ది దశలో ఉన్నందున వేగంగా పనులు పూర్తి చేసి డిసెంబర్ మాసం చివరి వరకు బ్రిడ్జిని ప్రారంభించాలనే లక్ష్యంతో జి హెచ్ ఎం సి అధికారులు కృషి చేస్తున్నారు.