Home తెలంగాణ రూ.40 కి తగ్గిన టమోటాధర

రూ.40 కి తగ్గిన టమోటాధర

104
0

హైదరాబాద్‌ నవంబర్ 29
నిన్నా మొన్నటి దాకా కిలోకు దాదాపు వంద రూపాయలు పలికిన టమాట ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం బోయిన్‌పల్లి మార్కెట్‌లో రూ. 25 నుంచి రూ.28 వరకు పలకడమే ఇందుకు నిదర్శనం. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో ధరల తగ్గుదల నమోదైంది. టమాటా ధరలు భారీగా తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో రూ.30 –40 వరకు.. రిటైల్‌గా మాత్రం రూ.50– 60 పలుకుతోంది.అలాగే ఈ వారం టమాటా దిగుమతులు పెరగనుండటం గమనార్హం. ఆదివారం నగరంలోని వివిధ మార్కెట్లకు సుమారు 400 టన్నుల టమాటా దిగుమతి అయినట్లు మార్కెటింగ్‌ అధికారులు చెప్పారు. ఇదే మోతాదులో నిత్యం ఇలాగే దిగుమతి అయితే ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా. వచ్చే ఆదివారం వరకు కేజీ టమాటా రూ.20కి చేరుతుందని వ్యాపారులు అంటున్నారు.

Previous articleవర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏ. ఓ హేమలత
Next articleరాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతోన్న చలి తీవ్రత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here