విశాఖపట్నం
విశాఖ మన్యం అంటేనే అందరికీ గుర్తు తెచ్చేది అరకులోయ అందాలు.ఆదివారం చాపరాయి జలపాతం లో పర్యాటకులు కోలాహలం సందడి నెలకొంది.కార్తీక మాసం కావడంతో వివిధ ప్రదేశాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు.పద్మాపురం గార్డెన్,యు పాయింట్, ట్రైబల్ మ్యూజియం,కొల్లాపూటు జలతరంగణి కిటకిటలాడాయి.ఒకవైపు వలసిపూల సోయగాలు,మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు,అంతా ప్రకృతి సోయగాలు ఆహ్లాదకర వాతావరణం ఇవన్నీ చూడాలంటే ఆంధ్ర ఊటీ అరకు రావాల్సిందే.జన జాతర నెలకొనడంతో అరకులోయ సరికొత్త కళ వచ్చిపడింది.కార్తీక మాసం ప్రారంభంలోనే పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరగడంతో స్థానిక వ్యాపారస్తులు,ఆటో పొలాలు ,వాహన యజమానులు,లాడ్జి నిర్వాహకులు,హోటల్ యజమానులు,చిరు వ్యాపారుల కళ్ళల్లో సంతోషం పొంగి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Home ఆంధ్రప్రదేశ్ డుంబ్రిగుడ చాపరాయి లో పర్యాటకులు సందడి మన్యం అందాన్ని తిలకించేందుకు తరలివచ్చిన జనం