కోరుట్ల నవంబర్ 08
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఎంపీ యువ నాయకులు ఏనుములు రేవంత్ రెడ్డి 53 వ జన్మదిన వేడుకలు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా రావు ఆదేశాల మేరకు సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకుని ఒకరినొకరు తినుపించి, మిఠాయిలు పంచి పెట్టారు.ఆనంతరం మండల,పట్టణాధ్యక్షులు కొంతం రాజం, తిరుమల గంగాధర్ లు సంయుక్తంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు ,వీరు ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు , రేవంత్ రెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నిలదొక్కుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు . చిన్నప్పటి నుండి రాజకీయ లో ఆసక్తి ఉన్న యువ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ని రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ జన్మదిన వేడుకలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బొయినిపెల్లి సత్యంరావు ,పట్టణ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్, జిల్లా కిసన్ సెల్ ఉపాధ్యక్షులు ఏలేటి శశెంధర్ రెడ్డి, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ గౌడ్, కార్యదర్శి మ్యాకల నర్సయ్య ,ఎంబేరి సత్యనారాయణ, మాజీ పట్టణ అధ్యక్షులు ఏఆర్ అక్బర్, పట్టణ కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీరాముల అమరేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.