కరీంనగర్
ప్రేమ విఫలమయింది. ప్రేమజంట వేరువేరుగా తనువు చాలించింది. ఈ విషాద ఘటన గంగాధర మండలం వెంకంపల్లిలో జరిగింది. స్థానికంగా వుంటున్న మహేష్ ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి తండ్రి తన కొడుకు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. మరో వైపు అదే సమయంలో రూరల్ మండలంలోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన కావ్య అనే యువతి ఇంటి నుండి కనబడకుండా పోయి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మహేష్, కావ్య కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నట్లు స్థానికంగా చర్చ జరిగింది. సోమవారం రోజు ఇద్దరు ఫోన్ మాట్లాడుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, కావ్య కడుపు నొప్పి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. మహేష్, కావ్య కలిసి ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. .ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.