తిరుపతి ,అక్టోబర్ 06,
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ పై శిక్షణ కోసం ట్రైనీ ఐఏఎస్ లు బుధవారం తిరుపతికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసేదాకా వారు తిరుమలలో ఉండి అవగాహన కల్పించుకుంటారు. ఇందులోభాగంగా, తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన వ్యవహారాలు, ఆలయాల నిర్వహణపై టిటిడి పరిపాలనా భవనం లోని సమావేశ మందిరంలో జేఈవో సదా భార్గవి ట్రైనీ ఐఏఎస్ లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ తో పాటు టీటీడీ లోని అన్ని విభాగాల పరిపాలన గురించి ఆమె తెలియజేశారు.
డిప్యూటీ ఈవోలు
దామోదరం రమణ ప్రసాద్ పాల్గొన్నారు.