పత్తికొండ
పత్తికొండ మండలం లోని అన్ని గ్రామాల రైతు భరోసా కేంద్రం సిబ్బంది కీ వ్యవసాయ సబ్ డివిజన్ అధికారి ఎస్ఎండి మహమ్మద్ ఖాద్రి అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రబీ పంట కాలానికి సంబంధించి పప్పుశనగ మరియు మిరప పంటకు సోకు వివిధ రకాల తెగుళ్ళు మరియు పంటను ఆశించే వివిధ రకాల కీటకాల గురించి రైతు భరోసా కేంద్రం సిబ్బందికి అవగాహన కలిగించడం, మరియు వాటి నివారణ చర్యలను, యాజమాన్య పద్ధతులను సిబ్బందికి క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా పప్పు శనగ మరియు మిరప పంట పై ఎరువుల యాజమాన్యం గురించి వివరించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం యొక్క సిబ్బందికి వివిధ రకాల పంటల పై పూర్తి అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో క్లుప్తంగా అన్ని గ్రామాల రైతు భరోసా కేంద్రం సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఓ సరితా, ఏఈఓ రియాజ్ భాష, ఏఈఓ రుక్సానా, ఏఈఓ హనుమన్న, విఏఎ, విహెచ్ఎ లు పాల్గొన్నారు.