Home ఆంధ్రప్రదేశ్ గిరిజనులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అనంత ఎస్పీ ఫక్కిరప్ప కాగినెల్లి సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే...

గిరిజనులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అనంత ఎస్పీ ఫక్కిరప్ప కాగినెల్లి సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే వెంకట రామి రెడ్డి.

101
0

తుగ్గలి
తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరువు తాండ వద్ద అనంతపురం జిల్లా పోలీసులు,  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  బుధవారం రోజున గిరిజనల పరివర్తన సదస్సు ను నిర్వహించారు.ఈ సదస్సుకు కర్నూలు, అనంతపురం జిల్లాల సుగాలీలందరూ హాజరయ్యారు.ఈ సందర్భంగా సుగాలీలను ఉద్దేశించి అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప కాగినెల్లి మాట్లాడుతూ గిరిజనులు తమ వృత్తి అయిన నాటుసారా ను తయారు చేయడం మానుకుని ఇతర వ్యాపారాలు,పనులు చేసుకుని జీవనం కొనసాగించాలన్నారు.అలాగే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన తెలిపారు.అనంతరం గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది గిరిజనులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాలలో ఉన్నారని తెలియజేసారు.సుగాలీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని,వాటిని ఉపయోగించుకొని సుగాలీలందరూ అభివృద్ధి చెందాలని ఆయన తెలియజేసారు.అనంతరం మాజీ జెడ్పిటిసి నారాయణ నాయక్ కు అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప మరియు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మాజీ జెడ్పిటిసి నారాయణ నాయక్ మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా గిరిజనులలో కూడా మార్పు వచ్చిందని ఆయన తెలియజేసారు.చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామ్మోహన్, డిఎస్పి చైతన్య, సీఐ,ఎస్.ఐ లు,వైఎస్ఆర్సిపి ఎస్.టి సెల్ మండలాధ్యక్షులు భీమానాయక్, జడ్పిటిసి పులికొండ నాయక్,మాజీ జెడ్పిటిసి నారాయణ నాయక్,మాజీ ఎంపీపీ నారాయణ నాయక్, ఎంపిటిసి రాందాస్ నాయక్,సర్పంచ్ లు బాలమ్మ,ఎల్లి భాయి,సర్పంచ్ ల గౌరవ సలహాదారులు బాబు నాయక్,శంకర్ నాయక్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కృష్ణ నాయక్,గిరిజన నాయకులు అశోక్ నాయక్,గోవిందు నాయక్, హనుమంతు నాయక్,సోమ్లా నాయక్,రాము నాయక్ తదితర గిరిజన ప్రజలు పాల్గొన్నారు.

Previous articleపవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
Next articleపుట్టినరోజు సందర్భంగా రూ.20 వేల విరాళం.. సరస్వతి మాత సమక్షంలో జన్మదిన వేడుకలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here