Home ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కలిసిన త్రిదండి స్వామిజీ

సీఎం జగన్ కలిసిన త్రిదండి స్వామిజీ

102
0

అమరావతి
శనివారం నాడు సీఎం నివాసంలో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ను కలిసిన త్రిదండి చినజీయర్ స్వామి కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం  వైఎస్ జగన్ను చినజీయర్ స్వామి ఆహ్వానించారు. తరువాత చినజీయర్ స్వామి ఆశీస్సులు వైఎస్ జగన్ తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు వుంటాయని స్వామిజీ ముఖ్యమంత్రికి వివరించారు.  చినజీయర్ స్వామితో పాటు ముఖ్యమంత్రిని  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తదితరులు కలిసారు..

Previous articleకడప జిల్లా వరదలతో అల్లకల్లోలం … 57మంది గల్లంతు
Next articleకాలిన గాయాలతో యువకుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here