కరీంనగర్, నవంబర్ 05
పెట్రోలు,డీజిల్ పై రాష్ట్ర పరిధిలోని సుంకాన్ని తగ్గించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కరీంనగర్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.పెట్రోల్,డీజిల్ పై కేంద్రం తగ్గించిన ధరల విషయంలో ప్రజలు గమనించే విధంగా తిమ్మాపూర్ మండలంలో బంక్ వద్ద శుక్రవారం బీజేపీ నాయకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు .పెట్రోల్,డీజిల్ కోసం బంక్ వద్దకు వచ్చిన వాహనదారులకు పూలు ఇచ్చి కేంద్రం తగ్గించిన ధరలపై అవగాహన కల్పించారు.మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గోని ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు చాలా ఊరట కలిగించే విషయమని పేర్కొన్నారు.పెట్రోల్ పై రూ.5,డీజిల్ పై రూ.10 తగ్గించడం వల్ల వాహనదారులకు చాలా ఉపశమనమని అన్నారు.కరోనా పరిస్థితుల వల్ల దేశం లో ఆర్థికపరిస్థితుల ఇబ్బందులు ఉన్నాకూడా,ప్రజలకు మేలు జరిగే విదంగా కేంద్రప్రభుత్వం ప్రణాళికలు చేస్తుండటం గొప్పవిషమని అన్నారు. వేలకోట్ల నిధులు కేటాయించి,110 కోట్ల మందికి ఉచితంగా వాక్సిన్ ఇచ్చిన విషయాన్ని ప్రజలకు ప్రచారం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, చమురు ధరలపై అసత్యప్రచారం చేయడం చాలా సిగ్గుచేటని అన్నారు.దేశంలోని ఎన్నో రాష్ట్రాలలో చమురు ధరలపై ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించినట్లుగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తగ్గించాలని డిమాండ్ చేసారు. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ప్రతీ మంత్రి పెట్రోల్, డిజిల్ పై మాట్లాడారే తప్ప,సామాన్యప్రజల కష్ట, సుఖాలపై మాట్లాడలేదని అన్నారు. ప్రజల మీద ప్రేమ ఉంటే హుజురాబాద్ లో మాట్లాడిన మంత్రులు ఇప్పుడు మాట్లాడి పెట్రోల్,డీజిల్ పై ధరలను తగ్గించాలని డిమాండ్ చేసారు.ప్రజలు కూడా వాస్తవాలను గ్రహించాలని కోరారు.చమురు ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.ఇటీవల ప్రమాదానికి గురై ఇంట్లో విశ్రాంతిలో ఉంటున్న మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి ని ఆయన పరామర్శించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేల్పుల రవీందర్ యాదవ్,తాళ్ళపల్లి రాజు గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్ కుమార్,ఉపాధ్యక్షుడు పబ్బ తిరుపతి,కిసాన్ మోర్చా అధ్యక్షులు కంది రాజేందర్ రెడ్డి,జిల్లా ఈసీ మెంబర్ వేల్పుల శ్రీనివాస్ యాదవ్, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ఈసరి జశ్వంత్,జిల్లా ఈసీ మెంబర్ బండి సాగర్, మండలం అధ్యక్షులు గడ్డం అరుణ్,రేగుల శ్రీనివాస్,ఉపాధ్యక్షులు ఆవుల వేణు యాదవ్,రేగురి సుగుణాకర్, కాల్వ శ్రీనివాస్ యాదవ్,మాడిశెట్టి సత్యనారాయణ,శాబోలు గణేష్ తదితరులు పాల్గొన్నారు.