Home జాతీయ వార్తలు లోక్ సభ లో టిఆర్ఎస్ ఎంపీలు ఆందోళన స్పీకర్ పోడియం వద్ద నినాదాలు

లోక్ సభ లో టిఆర్ఎస్ ఎంపీలు ఆందోళన స్పీకర్ పోడియం వద్ద నినాదాలు

83
0

న్యూఢిల్లీ
పార్లమెంట్లో తొలి రోజే రభస మొదలైంది. లోక్సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది. కానీ ఆ సమయంలో టీఆర్ఎస్ నేతలు సభలో నిరసన చేపట్టారు. లోక్సభలో పోడియం దగ్గరకు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మక్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ బిర్లా సభను వాయిదా వేశారు.

Previous articleగూడూరు జలమయం
Next articleశ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ల‌క్షకుంకుమార్చ‌న‌ – వ‌ర్చువ‌ల్ సేవ‌లో పాల్గొన్న గృహ‌స్తులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here