హుజూరాబాద్ అక్టోబర్ 2
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఏ గ్రామానికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. గడపగడపకూ వీర తిలకం దిద్ది, ఉప పోరుకు సాగనంపుతున్నారు. రైతన్నలు నాగళ్లను బహుమతిగా ఇచ్చి ఈటల అక్రమాల కోటలను దున్నమని ఆశీర్వదిస్తున్నారు.మల్లాపూర్ మండలంలోని గుండె 7 గ్రామంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. ప్రతి ఒక్కరూ వారికి సాదర స్వాగతం పలికి ఆశీర్వదించారు.కొత్తపల్లి గ్రామంలో ప్రజలు భారీర్యాలీ తీశారు. డప్పు దరువులు, కోలాట నృత్యాలతో గెల్లు శ్రీనివాస్ బృందానికి ఘనస్వాగతం పలికారు. పలువురు రైతన్నలు నాగళ్లను బహూకరించారు.కొందరు యాదవులు గెల్లు శ్రీనివాస్‌కు గొర్రెపిల్లలు, గొంగడిని బహూకరించారు. ఈ సందర్భంగా స్థానిక కోలాట కళాకారులతో కలిసి నృత్యమాడారు గెల్లు శ్రీనివాస్.పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొని టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని నినదించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అతి సామాన్యుడిగా భరిలోకి దిగిన తాను, మీ బిడ్డలా అందరి క్షేమం, సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు.