మహబూబ్ నగర్’ సెప్టెంబర్ 20
భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అడ్డాకుల మండల కమిటీ ఏర్పాటు
అడ్డాకుల మండల టిఆర్ఎస్ పార్టీ కమిటీ మరియు అనుబంధ కమిటీల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ నాగేందర్ గౌడ్ .
అడ్డాకుల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గా శ్రీనివాస్ రెడ్డి,
మండల యూత్ అధ్యక్షుడు గా బాలరాజు ను నియమించారు . ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ పటిష్టానికి కృషి చేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన టీఆరెఎస్ పార్టీ గ్రామ, అనుబంధ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ, అనుబంధ కమిటీల సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Home తెలంగాణ టిఆర్ఎస్ పథకాలను ప్రజల్లో విరివిగా తీసుకోవాలి క్యాడర్ కు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే ఆల...