Home తెలంగాణ హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఐదు నెలల్లోనే 5 వేల కోట్ల ఖర్చు

హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఐదు నెలల్లోనే 5 వేల కోట్ల ఖర్చు

68
0

హైదరాబాద్ నవంబర్ 2
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. సంచలన కామెంట్స్ చేశారు. దాదాపు 30 వేల మెజార్టీతో ఈటల రాజేందర్ గెలవబోతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌కు ఈటల భారీ షాకివ్వబోతున్నారని తేల్చిచెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఐదు నెలల్లోనే 5 వేల కోట్లను ఖర్చు చేసిందని వెల్లడించారు. అంత డబ్బు పంచినప్పటికీ హుజూరాబాద్ ప్రజలు గులాబీ పార్టీకి అదిరిపోయే తీర్పును ఇస్తున్నారన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తక్కువ ఓట్లు ఉండటంపై కూడా కోమటిరెడ్డి స్పందించారు. ‘శత్రువుకు శత్రువు మిత్రుడు. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువయిన ఈటలకు మేం మద్దతు ఇవ్వక తప్పలేదు. మేం గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ పార్టీకే లబ్ది కలుగుతుంది. ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలికతో కేసీఆర్ గెలిచి మళ్లీ ప్రజలను మభ్యపెడతారు. అందుకే ఈసారి మేం కాస్త వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఈటలకు పరోక్ష మద్దతును ఇవ్వాల్సి వచ్చింది’ అంటూ కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు.

Previous articleఆస్ట్రేలియా గుర్తింపు దేశ వ్యాక్సిన్‌కు ఘ‌న విజ‌యం
Next articleపోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here