తిరుపతి,మా ప్రతినిధి, నవంబర్ 01,
విజలెన్స్ అవగాహన వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
అలిపిరి పాత చెక్ పోస్ట్ వద్ద సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అలిపిరి కొత్త చెక్ పోస్ట్ వరకు ర్యాలీ సాగింది. అదనపు సీవోఎస్వో శివకుమార్ రెడ్డి, విజివో లు మనోహర్, బాలిరెడ్డి తో పాటు ఏవీఎస్వోలు, విజిలెన్స్ ఇన్స్ పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.