కామారెడ్డి అక్టోబర్ 28
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి 20 మందిని గాయపరిచింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు కుక్కను చంపేశారు. 20 మందికి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం బాన్స్వాడ ఆస్పత్రికి తరలించారు. 30 పడకల ఆసుపత్రి నిర్మించి ఒక వైద్యునికి కూడా నియమించకపొవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను స్థానిక ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు రాజు, సొసైటీ చైర్మన్ బాలాజీ(బాలు) , తెరాస ప్రధాన కార్యదర్శి రామ్ చందర్ , గిరిజన నాయకులు నౌషా నాయక్, పంచాయతీ కార్యదర్శులు రమేష్ పరామర్శించారు. ఆస్పత్రి వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది.