Home తెలంగాణ తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో ఇద్దరి అరెస్టు

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో ఇద్దరి అరెస్టు

121
0

హైదరాబాద్ అక్టోబర్ 1
తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ లోతెలుగు అకాడమీకి చెందిన నిధుల్లో మొత్తం రూ. 70 కోట్లు మాయమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ మేనేజర్ పద్మావతి అరెస్టయ్యారు. ఈ కేసుపై నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక సిద్ధమైందని, శనివారం నాడు ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. తెలుగు అకాడమీకి మొత్తం 11 బ్యాంకుల్లో 34 ఖాతాలు ఉన్నాయి. వీటిలో కెనరా బ్యాంకు చందానగర్ బ్రాంజి నుంచి రూ.8 కోట్ల డిపాజిట్ విత్‌డ్రా అవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.యూనియన్ బ్యాంకులోని నిధులు కూడా మాయమైనట్లు తేలడంతో అకాడమీ అప్రమత్తమైంది. నిధులు గోల్‌మాల్ చేయడంలో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉందని అనుమానించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Previous articleపోషకాహారలోప నివారణే లక్ష్యం పోషకాహార బోనమెత్తిన రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్
Next articleఅమ‌రీంద‌ర్ సింగ్ తానూ పెట్టబోయే పార్టీ పేరు పంజాబ్ వికాస్ పార్టీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here