శ్రీనగర్ అక్టోబర్ 16
జమ్ముకశ్మీర్‌లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో)తోపాటు ఇద్దరు జవాన్ల జాడ తెలియడం లేదు. పూంచ్-రాజౌరి అటవి ప్రాంతంలో సోమవారం నుంచి ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య భారీ స్థాయిలో ఎన్‌కౌంటర్ జరుగుతున్నది. గురువారం నాటికి ఐదుగురు జవాన్లు, ఒక జేసీవో వీరమరణం పొందారు.మరోవైపు గురువారం సాయంత్రం నుంచి జేసీవోతో కాంటాక్ట్‌ను ఆర్మీ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పూంచ్ జిల్లా నార్ ఖాస్ అటవీ ప్రాంతంలోని మెంధర్ సబ్ డివిజన్‌లో కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతున్నది. అక్టోబర్ 14 సాయంత్రం ఆర్మీ దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జేసీవో, ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆపరేషన్లు కొనసాగుతున్నాయి’ అని పేర్కొంది.అయితే ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఆర్మీ శుక్రవారం ధ్రువీకరించింది. గాయపడిన జేసీవో గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో జాడ లేని జేసీవో కోసం శనివారం ఉదయం ఆర్మీ భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఒక అధికారి తెలిపారు. నార్ ఖాస్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరి వేతకు భారీగా కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు చెప్పారు.కాగా, ఈ ప్రాంతంలో సోమవారం మొదలైన్ ఎన్‌కౌంటర్ ఆరో రోజుకు చేరింది. ఇప్పటి వరకు ఒక జేసీవో, ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఇటీవల భారీ స్థాయిలో జవాన్లను కోల్పోవడం ఇదే తొలిసారి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదు. మరోవైపు భద్రతా కారణాల నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి పూంజ్-జమ్ము జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు.
Home జాతీయ వార్తలు జమ్ముకశ్మీర్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తోపాటు ఇద్దరు జవాన్ల మిస్సింగ్ పూంచ్...