Home ఆంధ్రప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దుర్మరణం

144
0

విశాఖపట్నం
విశాఖ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందారు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని వీ కన్వెన్షన్ హాల్ ఎదురుగా మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతులను ధనరాజ్ (22), కె.వినోద్ ఖన్నా (22)గా గుర్తించారు. పీఎం పాలెం పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం
మంగళవారం రాత్రి మారికవలసలోని శారదానగర్-2 ప్రాంతానికి చెందిన ధనరాజ్, స్వతంతర్ నగర్కు చెందిన కె.వినోద్ ఖన్నా కలిసి లా కళాశాల సమీపంలోని పనోరమ హిల్స్లో ఉన్న స్నేహితుడు ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలకి చేరుకున్నారు.  కొద్దిసేపు అక్కడ గడిపిన తర్వాత బైక్లో పెట్రోల్ పోయించుకునేందుకు కొమ్మాది పెట్రోల్ బంక్కు వెళ్లారు.    పెట్రోల్ పోయించుకున్న అనంతరం అక్కడి నుంచి తిరిగి పనోరమ హిల్స్కు వెళ్లేందుకు బయల్దేరారు.
ఈ క్రమంలో స్టేడియం వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం వాళ్ల బైక్ను ఢీకొట్టింది. దీంతో ధనరాజ్, వినోద్ ఖన్నా అక్కడికక్కడే మృతిచెందారు. ధనరాజ్ ఇన్ఫోసిస్లో…వినోద్ ఖన్నా స్థానికంగానే రామాటాకీస్ వద్ద ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. పీఎం పాలెం సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Previous articleజేసీ కాన్వాయిలో ప్రమాదం…నలుగురికి తీవ్రగాయాలు
Next articleపుష్ప: ది రైజ్’ నుంచి దాక్షాయణిగా అనసూయ ఫస్ట్ లుక్ విడుదల..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here