అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి‘ అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ కూడా అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.
ఈ పాట లిరిక్స్..
లెహరాయి.. లెహరాయీ.. ఏ లేలేలే.. లేలేలేలే..
లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..
లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..
ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..
కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..
సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..
లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..
లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..
రోజూ చక్కిలితో సిగ్గుల తగువాయే..
రోజూ పెదవులతో ముద్దుల గొడవాయే..
వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే..
మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ..
లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..
లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..
వేలా పాలలనే మరిచే సరసాలే..
తేదీ వారాలే చెరిపే చెరసాలే..
చనువు కొంచెం పెంచుకుంటూ.. తనువు బరువే పంచుకుంటూ..
మనలోకం మైకం ఏకం అవుతూ.. ఏకాంతాలే లెహరాయీ..
లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..
లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..
ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..
కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..
సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..
నటీ నటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభయ్, అమిత్ తదితరులు..
==============
67. 19న ఉచిత మోడల్ లాసెట్ పరీక్ష
నెల్లూరు
ఈనెల 19న స్థానిక పొదలకూరు రోడ్డు లేక్ వ్యూ కాలనీ 3వ వీధి లో ఉన్న లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత మోడల్ లాసెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నాగరాజ్ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా సెట్ వ్రాయబోతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మోడల్ లాసెట్ పరీక్ష నిర్వహించబడుతుం ధన్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలో జిల్లా ప్రాంతాలకు విభేదాలు లేకుండా ఎక్కడివారైనా పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకొని ప్రకటించారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా శెట్టిపల్లి శ్రీదేవి, ఉపాధ్యక్షులుగా షేక్ బాబా, సంయుక్త కార్యదర్శులుగా షేక్ షఫీ మరియు సిహెచ్ శ్రీధర్ లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి వి ప్రసాద్ రావు, ఉపాధ్యక్షులు నక్కా సీనయ్య తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి ‘లెహరాయీ’ లిరికల్ సాంగ్‌కు అనూహ్య స్పందన.