గుంటూరు
గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ ప్రాంతంలోని పట్టాభిరామయ్య కాలనీలో శ్యాము అనే వ్యక్తి తన ఇంటి ముందు పార్క్ చేసిఉన్న బైకును ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని వెల్లడించారు. సుమారు బైక్ విలువ 50 వేలు ఉంటుందని , ఆ బైక్ ఉంటేనే నేను విజయవాడ పనులకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని అలాంటిది నా బైకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారని , నేను జీవనాధారం కోల్పోయానని తెలిపాడు. ఏదదయం 6 గంటలకి పోలీసువారికి తెలియజేసినా 9 గంటలకు కూడా పోలీసు వారు ఎవరు రాలేదని.. ఇక్కడ రాత్రిపూట బైక్ లో పెట్రోల్ కూడా దొంగతనాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు పోలీసులకి తెలియజేసిన ఎలాంటి ఫలితం లేదని అన్నాడు.