నంద్యాల
మంగళవారం నాడు నంద్యాల ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా. జా నో జాగో జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ ఉమర్. నంద్యాల పట్టణ ఇంచార్జ్ అక్బర్ ఖాన్ . మాట్లాడు తూ రైతులు చేస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో కేంద్రమంత్రి స్వగ్రామంలో ఆయన కుమారుడు రైతులపై కారు పోనిచ్చి రైతుల మృతికి కారణమైన ఆయన కుమారుని కేంద్ర మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే మనము రాజ్యాంగ వ్యవస్థ లో ఉన్నామా లేక పోతే అటవిక రాజ్యాంగంలో ఉన్నామా అని వారు అన్నారు. ఈ సంఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని రైతు కంట కన్నీరు కార్చిన ఏ ప్రభుత్వము బాగుపడిన దాఖలాలు లేవని అన్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు కంట కన్నీరు కలుస్తుందని రాబోయే రోజుల్లో వీరి యొక్క ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పోతుందని అన్నారు. ఈ చరిత్రలో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా వివరించలేదని దేశానికి వెన్నెముక అయిన రైతులపై ఇలాంటి సంఘటన చూస్తుంటే బిజెపి ప్రభుత్వం రైతులను భయబ్రాంతులకు గురి చేసి ఉద్యమాన్ని నీరుగార్చేలా చేయాలని చూస్తుంది అని అన్నారు. కానీ రాబోయే రోజుల్లో ప్రజలు దేశవ్యాప్తంగా బిజెపిని సమాధి చేసి రోజు దగ్గరలో ఉన్నాయని వారు అన్నారు.