నెల్లూరులో టిడిపి నేత వినూతన నిర్ణయం
నెల్లూరు నవంబర్ 18
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తూ టిడిపి సీనియర్ నేత కప్పిర శ్రీనివాసులు అరగుండు అర మీసం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఈనెల 15న జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల లో స్థానిక 50, 51 డివిజన్లలో లో తెలుగు దేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోతే ఎన్నికల ఫలితాల అనంతరం అరగుండు అరమీసం తోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల్లో తిరుగుతానని వైకాపా నాయకులకు విసిరిన సవాలుకు గాను తాను ఈ నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నారు. ఈనెల 17న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం స్థానిక 50, 51 డివిజనల్ లలో పోటీచేసిన టిడిపి అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన అనుచరులు 400 వందల మంది పైచిలుకు 50, 51 డివిజనల్ లో టిడిపి అభ్యర్థుల ఓటమికి వ్యక్తిగత చొరవతో 3 కోట్ల నగదు పంపిణీ చేసి అక్రమంగా గెలుపొందారు అని ఆయన ఆరోపించారు. జిల్లా టిడిపి నాయకులు తనకు అప్పగించిన 50, 51 డివిజన్లలో టిడిపి అభ్యర్థుల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు తన మెడలో జగన్ పోవాలి- బాబు రావాలి అనే నినాదాన్ని రాసిన పలకను మెడలో ఉంచుకొని తిరుగుతానని చెప్పారు. ఏది ఏమైనా సింహపురి చరిత్రలో లేనివిధంగా టిడిపి నేత కప్పిర శ్రీనివాసులు, ఎన్నికలకు ముందు విసిరిన సవాలును పాటించడం పై సింహపురి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.