Home వార్తలు విశాల్ హీరోగా వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న పాన్ ఇండియన్ మూవీ ‘లాఠీ’

విశాల్ హీరోగా వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న పాన్ ఇండియన్ మూవీ ‘లాఠీ’

114
0

యాక్షన్  హీరో విశాల్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం విశాల్  ఏ వినోద్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.
నేడు (అక్టోబర్ 17) ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను గ్లింప్స్ ద్వారా విడుదల చేశారు.  టెర్రస్ మీద ఉన్న షర్ట్ పోలీస్ యూనిఫాంలా మారడం.. దానిపై విశాల్ పేరు ఉండటం, అక్కడే ఉన్న కర్ర లాఠీగా మారడంతో సినిమా కాన్సెప్ట్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఆ తరువాత లాఠీ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతోందని రివీల్  చేసేశారు. పవర్ ఫుల్ ఆఫీసర్ చార్జ్ తీసుకోబోతోన్నాడంటూ చెప్పడం చూస్తూ అది హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. లాఠీ అనేది ఎంతో శక్తివంతమైంది. అది సమాజంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. అన్ని భాషల్లోనూ లాఠీ అనే టైటిలే ఉండబోతోంది. రానా ప్రొడక్షన్స్‌లో రమణ, నందా కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటించనున్నారు. లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. దిలీప్ సుబ్బరాయణ్ అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లను కంపోజ్  చేయనున్నారు. బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్‌గా, పార్థిబన్ ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్నారు

Previous articleద‌స‌రా రోజున లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఇళ‌య‌రాజా ‘మ్యూజిక్ స్కూల్‌’
Next articleతండ్రిని హతమార్చిన తనయుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here