నెల్లూరు
నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని 27 వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత 3 సంవత్సరాలుగా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు అధ్వాన స్థితిలో వచ్చాయన్నారు. టిడిపి ప్రభుత్వంలో లక్షలాది కోట్ల నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు నిర్వహించడం జరిగిందన్నారు. వైకాపా నాయకులు దోచుకోవడం దాచుకోవడం తప్ప, అభివృద్ధి అన్నమాటే లేదని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు స్వస్తి పలకాలి అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా తొలుత స్థానిక నిప్పో సెంటర్ ప్రాంతంలో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి గుడి పుట్ట వీధి నుండి టిడిపి నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేదాయపాలెం, త్యాగరాజు నగర్ లో ఉన్న క్లస్టర్ 7, సచివాలయంలో లాంచనంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.