మద్దికేర
మద్దికెర మండల వ్యాప్తంగా వాడుకలోలేని నిరుపయోగంగా ఉన్న బోరుబావులను తక్షణమే పూడ్చి వేయాలని మద్దికేర ఎస్.ఐ మమత తెలియజేశారు. గురువారం రోజున మద్దికేర లోని మార్కెట్ రోడ్డు నందు గల ఖాళీ స్థలంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావిలో చిన్న కుక్క పిల్ల పడిపోయింది. దీనిని గమనించిన కాలనీవాసులు అందరూ కలసి చిన్న కుక్కపిల్లను ప్రాణాలతో కాపాడారు. అనంతరం వాడుకలోలేని ఆ బోరు బావి రంధ్రాన్ని మూసివేశారు.ఈ సందర్భంగా మద్దికేర ఎస్.ఐ మమత మాట్లాడుతూ బోరు బావులలో చిన్నపిల్లలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున,వినియోగంలో లేని బోరుబావులను తక్షణమే పూడ్చివేయాలని ఆమె తెలియజేశారు. ఇటువంటి నిబంధనలను పాటించని యెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.ఈ ప్రయత్నంలో కుక్క పిల్లను బోరు బావి నుండి బయటకు తీసి ప్రాణాలు కాపాడిన సలీం మరియు సురేష్ లకు ఎస్సై మమత అభినందనలు తెలియజేశారు.
Home ఆంధ్రప్రదేశ్ రుపయోగంగా ఉన్న బోరు బావులను తక్షణమే మూసివేయాలి మద్దికేర ఎస్సై మమత బోరుబావిలో పడ్డ...