చిత్తూరు నవంబర్ 2
యూటీఎఫ్ ఆధ్వర్యంలో చిత్తూరు డీఈవో కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. బోధనను బలి చేసే యాప్‌లను, విద్యార్థులకు నష్టం కలిగించే అనవసరమైన యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బోధనకు ఆటంకం కలిగిస్తున్న అనవసరమైన యాప్‌లను వెంటనే తొలగించాలన్నారు. రాయలసీమ జిల్లాల్లో యాప్‌లు అప్ లోడ్ చేయలేదని 4 వేల మంది హెచ్ఎంలకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అనవర యాప్‌లను రద్దుచేయలేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు