గోనెగండ్ల
మండలకేంద్రమైన గోనెగండ్ల లోని రెండవ సచివాలయం పరిధిలోని కుటుంబాలకు శుక్రవారం వైద్యసేవలు అందించడానికి104 వాహనం వచ్చింది. ఈ సందర్భంగా సర్పంచ్ పూజారి హైమావతి మాట్లాడుతూప్రతినెలకు ఒకసారి 104 వాహనం సచివాలయాల ప్రకారం వచ్చి వైద్యసేవలు అందిస్తుంది అని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కలరా లాంటి రోగాల బారిన పడకుండా గ్రామ ప్రజలు 104 సేవలను వినియోగించుకోవాలని 2వ సచివాలయంలోని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో104 సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.