Home ఆంధ్రప్రదేశ్ నూత‌న జెఈవోగా వి.వీరబ్రహ్మయ్య బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

నూత‌న జెఈవోగా వి.వీరబ్రహ్మయ్య బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

102
0

తిరుమల,మా ప్రతినిధి,సెప్టెంబర్ 25,
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల నూత‌న తిరుప‌తి జెఈవోగా  వి.వీరబ్రహ్మయ్య శనివారం ఉద‌యం శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం

రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆలయ డెప్యూటీ ఈఓ  రమేష్ బాబు స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్ ను నూతన జెఈఓకు అంద‌జేశారు.

ఈ సందర్భంగా

వి.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్వహణ చేస్తున్న టిటిడి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో సేవ చేయడం గొప్ప అవకాశమన్నారు. టిటిడి నియమ నిబంధనల మేరకు తనకు విధులు

నిర్వహించే శక్తిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా టిటిడి బోర్డు ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.

Previous articleటిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా డా. ఎస్.శంకర్ ప్రమాణస్వీకారం
Next articleఎగుమతుల అవకాశాల సద్వినియోగానికే వాణిజ్య ఉత్సవం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here