Home ఆంధ్రప్రదేశ్ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్...

కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా

168
0

ప్రతి ఒక్కరూ బాధ్యతగా కోవిడ్ టీకాను వేయించుకోవాలని, జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏస్. బి. అంజాద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గుంత బజార్ లోని అమీన్ షా ఫకీరా  మసీదు నందు ప్రత్యేక కోవిడ్ -19 టీకా కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏస్.బి. అంజాద్ బాషా పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఏకైక మార్గం ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం కావడం జరిగిందని, అనేకమంది ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు సైతం కోల్పోవడం జరిగిందని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ తప్పకుండా మనమందరం చేయించుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలనే ఆలోచన లో భాగంగా ఉచితంగా వ్యాక్సినేషన్ ను అందించడం జరుగుతోందన్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతోందన్నారు. ఇందు కొరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం తో మాట్లాడడం జరిగిందని ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు పైబడిన అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అన్నారు.  కడప నగరంలో 40 మసీదులలో ఈరోజు పవిత్ర శుక్రవారం రోజున వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగానే కడప నగరంలోని గుంత బజార్ ప్రాంతంలో ఉన్న మసీదులో తాను పాల్గొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. కడప నగర ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా యావత్ ప్రజానీకానికి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ముఖ్యంగా యువత ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ప్రతి మసీదు వద్ద సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకూ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది మరియు మసీదు కమిటీ సభ్యులు, నాయకులు, కార్పొరేటర్లు సహకరించడం ఎంతో సంతోషమని కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాబోవు రోజుల్లో మరల కోవిడ్ మహమ్మారి వచ్చే సంకేతాలు అందుతున్నాయని, భారతదేశంలో కేరళ రాష్ట్రంలో మరియు పలుచోట్ల కేసులు పెరుగుతున్నట్లు చూస్తున్నామని అన్నారు. అలాంటి పరిస్థితి మన రాష్ట్రం లో, జిల్లాలో రాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అన్నారు. వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు కూడా తప్పక మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. ముఖ్యంగా జన సమూహం ప్రాంతాల్లో తప్పక మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ మహమ్మారి నియంత్రణ కు అధిక నిధులు కేటాయించి, కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు మెరుగైన చికిత్సను, పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ మహమ్మారిని పారద్రోలేందుకు సహాయ సహకారాలు అందించాలని, కలసికట్టుగా మహమ్మారిని జిల్లా నుండి, రాష్ట్రం నుండి దేశం నుండి తరిమివేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కే నాగరాజు, డి ఐ ఓ మల్లీశ్వరి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్ వలీ, వైద్యాధికారులు డాక్టర్ కావ్య, డాక్టర్ హసీనా, డాక్టర్ జమాల్ బాషా, 30 డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ షఫీ, నాయకులు సుభాన్ భాష , దాసరి శివ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Previous articleమల్కాజ్గిరి సర్కిల్ లోని తెలంగాణ ఉద్యమకారులతో కలిసి తెలంగాణ జెండాను ఆవిష్కరించడం జరిగింది
Next articleలివర్ మార్పిడి శస్త్రచికిత్స కై దాతలు ఆర్థిక సహాయం అందించాలి లివర్ వ్యాధిగ్రస్తులు బ్రహ్మానంద రెడ్డి వేడుకోలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here