నెల్లూరు
నెల్లూరు నగర గ్రామీణ ప్రాంతాలలో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం మొదలైంది. వైకాపా, టిడిపి, బిజెపి, కాంగ్రెస్, జనసేన తదితర పార్టీలతో పాటు వామపక్ష పార్టీల తరపున అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి వైకాపా నెల్లూరు నగర గ్రామీణ ప్రాంతాలలో తమ అభ్యర్థులను ఎంపిక చేసి పేర్లను ప్రకటించింది. ఈ క్రమంలో నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని 24 వ డివిజన్ వాస్తవ్యులైన అరవ శాంతి డివిజన్లోని పలు ప్రాంతాలలో ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 24 వ డివిజన్ కార్పొరేటర్ వైకాపా అభ్యర్థినిగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవకాశం ఇవ్వడం జరిగిందని, తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించింది. గడపగడపకు తిరుగుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేస్తూ, తన విజయానికి సహకారం అందించాలని కోరారు. డివిజన్ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తనవంతు చేయూతనందించే అవకాశం కల్పించాలని అభివృద్ధి చేశారు. ఆమె వెంట స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.