నెల్లూరు నవంబర్ 17
నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 15న జరిగిన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించి, వైకాపా జెండాను ఎగురవేశారు. రెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికలలో 20 వార్డులకు గాను 18 వార్డులలో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. 1వ వార్డు వైకాపా అభ్యర్థి కత్తి నాగరాజు, 3వ వార్డు వైకాపా అభ్యర్థిని అందే ప్రత్యూష,4 వ వార్డు కౌన్సిలర్ మరియు చైర్పర్సన్ అభ్యర్థిని మోర్ల సుప్రజా, 5వ వార్డు అభ్యర్థి షేక్ షాహుల్, 6వ వార్డు అభ్యర్థి రహమత్, 7వ వార్డు అభ్యర్థిని షేక్ షకీలా, 8 వ వార్డు పటాన్ నస్రీన్, 9 వ వార్డు అభ్యర్థి ఎరటపల్లి శివ కుమార్ రెడ్డి, 10వ వార్డు బెల్లం మల్లారెడ్డి, 11వ వార్డు అభ్యర్థి రాసూరి సత్యనారాయణ , 12వ వార్డు అభ్యర్థి కందుకూరి యానాదిరెడ్డి, 13వ వార్డు అభ్యర్థిని పుట్టా లక్ష్మీకాంతమ్మ , 14వ వార్డు అభ్యర్థి చీర్ల ప్రసాద్, 15 వ వార్డు అభ్యర్థిని కంట అనంతమ్మ, 16వ వార్డు అభ్యర్థి బిట్రగుంట ప్రమీలమ్మ, 18వ వార్డు అభ్యర్థిని మోర్ల జయంతి , 19వ వార్డు అభ్యర్థిని కోటంరెడ్డి లలిత, 20వ వార్డు కౌన్సిలర్ వైకాపా అభ్యర్థిని కత్తి శ్రీదేవి తదితరులు వైకాపా అభ్యర్థులుగా పోటీలో నిలిచి తమ ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు.