Home ఆంధ్రప్రదేశ్ వెంకటగిరి నియోజకవర్గ పరిషత్ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం

వెంకటగిరి నియోజకవర్గ పరిషత్ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం

110
0

నెల్లూరు

2019 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ రాని విధంగా దాదాపు 40 వేల మెజార్టీతో గెలిచి వెంకటగిరి నియోజకవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఒక చరిత్ర సృష్టిస్తే , 2020 మార్చి నెలలో జరిగిన జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం జరిగిన జరిగిన కౌంటింగ్ ఫలితాలలో,వెంకటగిరి నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన 6 జడ్పీటీసీలు,65 ఎంపిటిసిలగాను 63 ఎంపీటీసీలను గెలుచుకుని ఆనం రామనారాయణ రెడ్డి క్లీన్ స్వీప్ చేసి మరో  చరిత్ర సృష్టించారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి, ఎంపీటీసీలుగా గెలిచిన అభ్యర్థులందరూ దాదాపు అత్యధిక మెజార్టీతో గెలిచిన వారే కావడం విశేషం. వెంకటగిరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఏకగ్రీవంగా 29 ఎంపీటీసీ స్థానాలు ,ఒక జడ్పిటిసి చేరింది. వెంకటగిరి మండలం లో 5/5, బాలాయపల్లి మండలం లో 8/8, డక్కిలి మండలంలో 5/5, కలువాయి మండలం లో 8/7, సైదాపురం మండలం లో 10/9 మరియు వైసిపి రెబల్ 1 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వెంకటగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు సమయంలో ఎమ్మెల్యే శ్రీ.ఆనం  దగ్గరుండి పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు ఫలితాల అనంతరం  ఆనం మీడియాతో మాట్లాడుతూ పరిషత్ ఎన్నికలు జరిగాక ఫలితాల విషయంలో ఇంత ఆలస్యం కావడం దేశ చరిత్రలోనే ప్రథమం అన్నారు. నెల్లూరు జిల్లాలో 46 జెడ్ పి టి సి స్థానాలకు గాను 46 జడ్పిటిసి గెలుచుకోవడం ఒక చరిత్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  నేతృత్వంలో ఆయన అమలు చేసిన అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు పరిషత్ ఎన్నికల ఫలితాలని  ఆనం అన్నారు. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా వైసీపీ శ్రేణులు ఒక సమిష్టిగా పనిచేసి ప్రజలకు చేదోడువాదోడుగా ఉండి, పరిషత్ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి కారకులైనారని  ఆనం అన్నారు. వెంకటగిరి నియోజకవర్గం లో పరిషత్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీ అఖండ విజయానికి కారకులైన ప్రతి నాయకుడికి కార్యకర్తకి ఆనం కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం వైఎస్సార్ సీపీ శ్రేణులు తెలుగు గంగ గెస్ట్ హౌస్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గెలిచిన అభ్యర్థులందరూ స్థానిక తెలుగు గంగ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు

Previous articleఅక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 11న గ‌రుడ సేవ‌ ప్ర‌తి జిల్లా నుండి బ‌స్సుల ద్వారా వెనుక‌బ‌డిన ప్రాంతాల భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం ఏర్పాట్ల‌పై టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స‌మీక్ష‌
Next articleపేదలందరికీ ఇల్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయం తో ఉంది ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి కాలనీలకు అన్ని వసతులు కల్పించేలా చూడండి రోజువారీ పని తీరును సమీక్షించండి హౌసింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here