రాజన్న సిరిసిల్ల నవంబర్ 18
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ గురువారం ఇందిరాపార్క్ మహా ధర్నాకు దిగింది. ఈ మహా ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పాల్గొనాలని టీఆర్ఎస్ అధిష్టానం పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు గురువారం వేములవాడ అర్బన్ మండలం గ్రామాల నుండి హైద్రాబాద్ లోజరిగే టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షులు ఊరడి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు ,జడ్పీటీసీ మ్యాకల రవి ,సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఊరడి రామ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవిచందర్ రావు.సర్పంచ్ లు జింక సునీత వేణు, రాసురి రాజేష్,రాణిహరిచరణ్ రావు, వెంకటరమణ రావు , లక్ష్మారెడ్డి,నరేష్,లక్ష్మణ్, పర్శరాములు, హరికృష్ణ, రవి, మహేష్,రవి, జల,కొమురవ్వ ఎల్లయ్య,మెరుగు శ్రీనివాస్ తరలి వెళ్లారు