నెల్లూరు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వెంకటగిరి నియోజకవర్గం లో అన్ని స్థానాల్లో తిరుగులేని విజయం సాధించామని మాజీమంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు .సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తో కలిసి నెల్లూరు నగరం లోని తన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 63 ఎంపిటిసి స్థానాల్లో విజయకేతనం ఎగురవేసామాన్నారు.ఈసారి మహిళామణులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు అని వివరించారు.
వెంకటగిరి నియోజక వర్గంలో 6 జడ్పిటిసి స్థానాలు ఉంటే ,అన్ని జడ్పిటిసి స్థానాల్లో ఘన విజయం సాధించడం జరిగిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎన్నికల అబ్జర్వర్ గా పనిచేసిన ధనుంజయ రెడ్డిలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. నూటికి నూరు శాతం గెలుపొంది రికార్డు స్థాయి విజయం సాధించామని పేర్కొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ వెంకటగిరిలో నూరు శాతం స్థానాల్లో ఘనవిజయం సాధించాం ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో సమిష్టి విజయం ...